కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఇచ్చిన బంద్ (Telangana Bandh) పిలుపునకు కరీంనగర్ (Karimnagar) జిల్లా చికెన్ సెంటర్ ఓనర్స్ వెల్ఫేర్ అసొసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కంపెనీలు మార్జిన్ ఇవ్వకుండా వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసొసియేషన్ నేతలు తెలిపారు. మంగళవారం జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు ఎండీ నవాబ్ మాట్లాడారు. “మార్జిన్ ఇవ్వని కొన్ని కంపెనీలు తమ దౌర్జన్యాన్ని కొనసాగిస్తూ చిరు వ్యాపారులను నష్టాల్లోకి నెడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించడమే కష్టంగా మారింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
చికెన్ సరఫరాలో కంపెనీలు విధించిన తక్కువ మార్జిన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ బంద్‌కు మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. సరైన మార్జిన్ విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చికెన్ వ్యాపారులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్.వి. రాంరెడ్డి, ఉపాధ్యక్షులు ఎం.డి.యునస్, బాలాజీ, జాయింట్ సెక్రటరీ రహిం పాల్గొన్నారు.
Read Also: కవిత క్షమాపణలన్నీ ఓట్ల కోసమేనా?
Follow Us On : WhatsApp

