Mobile Popup Ad
Mobile Popup Ad

కూకట్‌పల్లిలో మహిళ ఆత్మహత్య.. భర్త ఇంటికి నిప్పు

కలం, వెబ్ డెస్క్ : కూకట్‌పల్లి (Kukatpally Tragedy)లో ఇద్దరు కొడుకులను చంపి ఆత్మహత్య చేసుకున్న స్రవంతి సొంతూళ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యం తండాలో స్రవంతి బంధువులు భర్త ప్రవీణ్ ఇంటికి నిప్పు పెట్టారు. ప్రవీణ్ వేధింపుల వల్లే తన కూతురు, బలయ్యారని ఆరోపిస్తూ స్రవంతి బంధువులు వీరంగం సృష్టించారు. కాగా, మంగళవారం ఉదయం స్రవంతి తన ఇద్దరు కుమారులకు ఉరివేసి హత్య చేసి.. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది.

గతంలో స్రవంతి, ప్రవీణ్ లకు మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో మాట్లాడడానికి స్రవంతి వెళ్లింది. అప్పుడే ప్రవీణ్ రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్రవంతి కుమారులను చంపి ఆత్మహత్య చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్రవంతి బంధువులు తమ కూతురు ఆత్మహత్యకు ప్రవీణ్ కారణమని ఆరోపిస్తూ అతని ఇంటికి నిప్పు అంటించారు.

Read Also: కవిత క్షమాపణలన్నీ ఓట్ల కోసమేనా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>