కలం, కరీంనగర్ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై (PC Ghose Report) తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కరీంనగర్ (Karimnagar) లో బీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌక్ లో టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. హై కోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి (Revanth Reddy) కుట్ర పూరితంగా ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ నివేదిక అంతా తప్పుల తడకగా భావించి తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హై కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందనే భావనతో రెండున్నరేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టును పట్టించుకొని రేవంత్ రెడ్డి రిపేరింగ్ పేరిట హడావుడి చేశారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి. రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్మణరావు, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: పార్టీ మార్పుపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి క్లారిటీ
Follow Us On: X(Twitter)

