ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

కలం, వెబ్ డెస్క్ : ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ (AP Weather) శాఖ  హెచ్చరికలు జారీ చేసింది. కాసేపట్లో పలు జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే కర్నూల్, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ సందర్భంగా 40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని  తెలిపింది. అయితే  గాలుల ప్రవాహంతో చెట్లు కూలడం, విద్యుత్ అంతరాయం వంటి ప్రమాదాలు ఉండవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఆశ్రయం పొందవద్దని సూచించారు.

Read Also: పార్టీ మార్పుపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి క్లారిటీ

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>