ఆర్ అండ్ బీ భవనం కూల్చివేత.. కందిలో రచ్చ!

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా కంది (Kandi) మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్ ఆవరణలో నిర్మిస్తున్న మహిళా సమైక్య భవనాల కాంట్రాక్టును 5వ వార్డు మెంబర్ బి. భాస్కర్ గౌడ్ చేపట్టారు. ఈ నిర్మాణానికి అవసరమైన బేస్‌మెంట్, వేస్టేజ్ మట్టి, ఇటుకల కోసం దీని పక్కనే ఉన్న వెయ్యి గజాల విస్తీర్ణంలోని ఆర్ అండ్ బి (R&B) భవనాన్ని కూల్చివేసి, దాని మెటీరియల్‌ను మహిళా సమైక్య భవనానికి ఉపయోగించుకోవచ్చనే ప్లాన్‌తో దాన్ని అక్రమంగా కూల్చివేశారని స్థానికులు ఆరోపిస్తూ మాజీ వార్డు మెంబర్లు ఆనంద్ రావు, జంగయ్య ఫిర్యాదు చేశారు.

సాధారణంగా ఏదైనా ప్రభుత్వ భవనాన్ని తొలగించాలంటే జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారుల ముందస్తు అనుమతులతో పాటు అధికారిక డిస్మాంటిల్ ఆర్డర్ తప్పనిసరి. కానీ వార్డు మెంబర్ భాస్కర్ గౌడ్ ఎలాంటి అనుమతులు లేకుండానే భవనాన్ని నేలమట్టం చేశారని గ్రామస్తులు మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన 5వ వార్డు మెంబర్ బి. భాస్కర్ గౌడ్‌పై వెంటనే చట్టరీత్యా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>