అలర్ట్.. రేపు నిర్మల్ టౌన్‌లో పవర్ కట్స్

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) పట్టణంలోని మొదటి సబ్‌ స్టేషన్‌‌లో మరమ్మతుల నేపథ్యంలో శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ శ్రీనివాస్‌రావు శుక్రవారం తెలిపారు. ఓల్డ్ బస్ స్టాండ్, బుధవార్‌ పేట్, నగరేశ్వరవాడ, బాగులవాడ, కలెక్టర్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, జోహ్రనగర్, ప్రియదర్శిని నగర్, ఏరియా హాస్పిటల్, బర్కత్‌ పురా, డాక్టర్స్ లైన్, కస్బా, పాత కమల్ టాకీస్, రాయల్ బిల్డింగ్, చింతకుంటవాడ, గాంధీచౌక్, ద్యాగవాడ, పింజారిగుట్ట లాంటి ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు.

అలాగే చిక్కడపల్లి, ఇంద్రానగర్, గొల్లపేట్, శాస్త్రీనగర్, చైన్ గేట్, మదీనా కాలనీ, ఇరిగేషన్ ఆఫీస్, సాగర్ కాలనీ, భాగ్యనగర్, రాంనగర్, ఆస్రా కాలనీ, ఎన్టీఆర్ మార్గ్, బోయివాడలో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలోని నటరాజ్ నగర్, సబ్ జైలు, శరద్ మహల్, మస్తాన్ దుబ్బ, మంజులాపూర్ ఎస్సీ కాలనీ, ఎల్‌ఐసీ కార్యాలయం, విజయనగర్ కాలనీ, శివాజీ నగర్ ప్రాంతాలకు కూడా విద్యుత్ సరఫరా ఉండదన్నారు. ఆయా కాలనీలకు చెందిన వినియోగదారులు సహకరించాలని ఏడీఈ శ్రీనివాస్‌రావు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>