కలం, వెబ్ డెస్క్ : వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ ను యూఎస్ మాజీ వైఎస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ (Kamala Harris) తప్పుబట్టారు. డ్రగ్స్ అక్రమ రవాణా విషయంలో మదురో అరెస్ట్ జరగలేదని.. వెనిజువెలాలో చమురు నిల్వల కోసమే ట్రంప్ అరెస్ట్ చేశారని విమర్శలు గుప్పించారు. ఇలాంటి చర్యలు ఉద్రేకాన్ని రేకెత్తిస్తాయని తెలిపారు. నికోలస్ క్రూరమైన నియంత అయినా సరే ఇలాంటి చర్యలు చట్టబద్ధం కాదని ఆమె తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల అమెరికాకే ప్రమాదం అని హెచ్చరించారు. ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం, చమురు నిల్వల కోసం ఇలా యుద్ధాలు మొదలు పెడుతూ పోతే.. చివరకు అమెరికన్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని కమలా హారిస్ (Kamala Harris) చెప్పారు.
ఇలాంటి చర్యలను అమెరికా ప్రజలు కోరుకోవట్లేదని.. ఇది అస్సలు మంచిది కాదని చెప్పుకొచ్చారు. ఇలాంటి వాటి వల్ల అమెరికా కుటుంబాలే నాశనం అవుతున్నాయని.. ఇది ప్రజాస్వామ్య బద్ధం అసలే కాదని తెలిపారు. ట్రంప్ చర్యలను చైనా, రష్యా, ఇరాన్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. అర్జెంటీనా, ఇజ్రాయెల్ లాంటి దేశాలే ఆయన్ను సమర్థిస్తున్నాయి.


