కలం, వెబ్ డెస్క్ : సంక్రాంతి పండుగకు (Sankranti) హైదరాబాద్ నగరం నుంచి లక్షలాది మంది తమ సొంతూళ్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రజల జాగ్రత్త దృష్ట్యా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (CP Sajjanar) ఎక్స్ వేదికగా పలు కీలక సూచనలు చేశారు. ప్రయాణాలు చేసే సమయంలో ఇండ్లల్లో నగలు, బంగారం, డబ్బులు, ఇతర విలువైన వస్తువులను ఉంచకూడదని సూచించారు. వీటిని బ్యాంకుల్లో లేదా ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచాలని సలహా ఇచ్చారు. Sankranti పండుగకు ఇండ్లకు తాళాలు వేసి వెళ్లే వారు ముందస్తు జాగ్రత్తగా తమ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలన్నారు.
పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల ఆయా ప్రాంతాల్లో నిరంతర పెట్రిలింగ్ నిర్వహించడం వల్ల నిరంతరం నిఘా ఉంటుందన్నారు. దీని వల్ల నేరాల నియంత్రించడం సులువు అవుతుందని తెలిపారు. ఇలా పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దొంగతనాలు తగ్గుతాయని, దీని ద్వారా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవచ్చని కమిషనర్ చెప్పారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే 100కు కాల్ చేయాలని సూచించారు. ప్రజల ఆస్తిపాస్తుల రక్షణకు హైదరాబాద్ పోలీస్ శాఖ ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుందని తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం అవసరం అని CP Sajjanar తన ట్వీట్ లో రాసుకొచ్చారు.


