‘కల్యాణలక్ష్మితో పేదింటి బిడ్డలకు కొండంత భరోసా’

కలం, నల్లగొండ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాలకు వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సూర్యాపేట (Suryapet) ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో కలిసి పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని 701 మంది లబ్ధిదారులకు రూ.7.02కోట్ల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Also: మళ్లీ పుట్టిన ‘టీఆర్ఎస్’.. పేరు, జెండా వెనుక కవిత స్ట్రాటజీ ఏంటి?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>