కలం, వెబ్ డెస్క్ : జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బతుకమ్మ లేకుండా రూపొందించిన తెలంగాణ తల్లి ప్రతిరూపం తెలంగాణ ఆత్మకు ప్రతీక కాదని ఆమె వ్యాఖ్యానించారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని, రాష్ట్ర ఉద్యమ సమయంలో ప్రజల భావోద్వేగాలతో ఏర్పడిన తెలంగాణ తల్లి (Telangana Thalli) రూపురేఖల్లో మార్పులు చేయడం.. ఉద్యమ చరిత్రను చెరిపివేయాలనే ప్రయత్నమని కవిత అన్నారు.
బతుకమ్మ (Bathukamma) తో కూడిన తెలంగాణ తల్లి ఉద్యమ త్యాగాలు, స్మృతులకు సజీవ ప్రతీకగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. చరిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం కాని వారు మొదట చేయాలనుకునేది చరిత్రను చెరిపివేయడం లేదా వక్రీకరించడం అని ఆమె విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం చేస్తున్న చర్యలు కూడా అదే దిశలో ఉన్నాయని కవిత ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది ప్రజల కంటే తనకు గొప్ప ఉద్యమ నేపథ్యం లేదని భావిస్తున్న రేవంత్ రెడ్డి, ఉద్యమ చరిత్రను మార్చాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు. అయితే అమరుల త్యాగాలను గుర్తుచేసే బతుకమ్మతో కూడిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్లీ ఇదే ప్రాంగణంలో ప్రతిష్టిస్తామని కవిత (Kalvakuntla Kavitha) స్పష్టం చేశారు.
Read Also: కేరళ అసెంబ్లీ ఫైట్.. బీజేపీ తొలి జాబితా విడుదల
Follow Us On: Youtube

