కలం, వెబ్ డెస్క్: గడ్డి, కలుపు మందులను వెంటనే నిషేధించాలని రైతు కమిషన్ (Farmers Commission) బృందం కోరింది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును (Minister Tummala) కలిసి నివేదికను అందజేసింది. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకుపైగా ఈ గడ్డి, కలుపు మందులను బ్యాన్ చేస్తే.. మనదేశంలో మాత్రం విచ్చల విడిగా అమ్మకాలు చేస్తున్నారని ప్రస్తావించింది. విచ్చిలవిడిగా అమ్మకాలతో రైతులు క్షణికావేశంలో వాటిని తాగడం చనిపోతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లింది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం వీటిని నిషేధించాలని కోరుతుందని, గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో ఎక్కువగా రైతుల మరణాలకు ఈ గడ్డి, కలుపు ముందుకే కారకులుగా ఉన్నాయని రైతు కమిషన్ గుర్తుచేసింది. తెలంగాణలో నిషేధించడంతోపాటు దేశ వ్యాప్తంగా నిషేధించేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖరాయాలని ముఖ్యమంత్రిని కోరింది. రైతు కమిషన్ ప్రతిపాదనను అసెంబ్లీలో చర్చిస్తామని, ఇలాంటి వాటిని రాష్ట్రంలో నిషేధించేందుకు చర్యలు చేపడ్తామని సీఎం రేవంత్ (Revanth Reddy) హామీ ఇచ్చారు
ఇక మంత్రి తుమ్మల సైతం కమిషన్ (Farmers Commission) ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. ఇదే అంశంపై రైతు కమిషన్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిసి రిపోర్ట్‌ను అందజేసింది. సీఎం, మంత్రులను కలిసిన వారిలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, కేవీఎన్ రెడ్డి, చెవిటి వెంకన్న , భవానీ రెడ్డి, కమిషన్ మెంబర్ సెక్రెటరీ గోపాల్ తదితరులున్నారు.
Read Also: బతుకమ్మతోనే నిజమైన తెలంగాణ తల్లి : కవిత
Follow Us On: Facebook

