Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ పవన్ కళ్యాణ్​​ జాగీరు కాదు: కల్వకుంట్ల కవిత

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ముమ్మాటికీ ఇక్కడి ప్రజల సొత్తు తప్ప పవన్ కళ్యాణ్​ తాత, ముత్తాతల జాగీరు కాదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) స్పష్టం చేశారు. ఆంధ్ర నాయకుల విష కోరల నుంచి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని, 1200 మంది అమరవీరుల త్యాగాలు చేసిన చోట పవన్ కళ్యాణ్​​ రాజకీయాలు చేస్తామంటే ఎలా ఒప్పుకుంటామన్నారు. ఆంధ్రాలో రాజధాని కట్టుకోలేక ఇక్కడికి వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వాళ్లు వద్దు అంటున్నా.. పవన్​ వన్ సైడ్ లవ్ ఎందుకు నడిపిస్తున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. సినిమాలకు కలెక్షన్లు ఎక్కువ తెలంగాణలోని నైజాం ప్రాంతం నుంచే వస్తాయన్నారు. పవన్ కళ్యాణ్​​ కొన్న ఇల్లు, కార్లు తెలంగాణ వాళ్లు డబ్బులు ఇవ్వడం కారణంగానే రాలేవా..? అని ప్రశ్నించారు. గద్దర్‌కు కారు కొనిచ్చానంటూ ఇప్పుడు చెప్పుకోవడం ఏంటన్నారు. అసలు ఆయన కొనిచ్చాడో.. లేదో.. కూడా ఎవరికీ తెలియదన్నారు. పవన్ కళ్యాణ్​​ సినిమాల్లో ఎన్నిసార్లు ఫోక్ సింగర్స్‌ ట్యూన్లను కాపీ చేసి పెట్టుకున్నారని.. మరి వారికి ఎప్పుడైనా రాయల్టీ చెల్లించారా..? అని నిలదీశారు.

పవన్ భూమిని స్వాధీనం చేసుకోవాలి..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు​ కోడికుంట చెరువు పరిధిలోని సర్వే నెంబర్ 706లో ఉన్న 10 ఎకరాలు మొత్తం శిఖం భూమి అని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆయన కొన్నప్పుడు ఇది మాగాణి అంటున్నారని.. రికార్డుల పరంగా అది చెరువు భూమే అని తేలినందున వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. చెరువు శిఖం అని తేలితే ఇచ్చేస్తానని పవన్ మొన్న చెప్పారని, వెంటనే అక్కడ వేసిన కంచె, మట్టి తొలగించాలని సూచించారు. తెలంగాణలో బీజేపీకి సీట్లు వచ్చే పరిస్థితి లేదని, అందుకే పవన్‌ను తీసుకొచ్చి రెండు ఓట్లు పొందాలని ప్రయత్నిస్తోందన్నారు. పంజాబ్‌లో వంద శాతం వడ్లు కొంటున్న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణలో మాత్రం ఎందుకు కొర్రీలు పెడుతోందన్నారు. బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>