కలం, వెబ్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అంశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు కు హైకోర్టు ఊరట కల్పించడంపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) స్పందించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పు ఇవ్వడంపై కోదండరాం స్పందిస్తూ .. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిటీ మాత్రమే నివేదిక ఇవ్వలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవడానికి ఈ తీర్పు ఆటంకం కాదని వ్యాఖ్యానించారు.
రెండు పిల్లర్లు కుంగిపోవడం కళ్లకు కనిపిస్తుండగా.. ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడానికి ఏం అడ్డం వస్తుంది? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై విజిలెన్స్ కమిషన్ తో పాటు నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారిటీ కూడా సమగ్రమైన నివేదికను తయారు చేశారని తెలిపారు. వీటన్నింటి ఆధారంగా కార్యాచరణ రూపొందించడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై జరిగిన అవకతవకలపై హైకోర్టు స్టే ఇచ్చిన వేళ ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Read Also: కాళేశ్వరంలో కేసులో బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం: విప్ వేముల
Follow Us On: Instagram

