కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం నియోజకవర్గంలో చోటు చేసుకున్న ప్రోటోకాల్ రగడ (Pithapuram Protocol Issue) పై తెలుగు దేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) స్పందించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వ్యవహారంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో నేతల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీలో తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావుతో పిఠాపురం గొడవపై చంద్రబాబు మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో నేతలిద్దరూ ఐక్యంగా పని చేసుకోవాలని సూచించారు. పార్టీ అంతర్గత క్రమశిక్షణకు సంబంధించి కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు.. పల్లా శ్రీనివాస్ కు సూచించారు.
కాగా, పిఠాపురంలో జరిగిన ఎన్యుమరేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ఫోటో లేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ (SVSN Varma) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఫోటో ఎక్కడా అంటూ అధికారులపైకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వర్మ, పెండెం దొరబాబు ఒకరినొకరు తోసుకుంటూ గొడవకు దిగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన చంద్రబాబు (CM Chandrababu).. వర్మ తీరుపై అంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: ఆన్‌లైన్ గేమింగ్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Follow Us On: Instagram

