కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్

కలం, వెబ్ డెస్క్ : కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. రిపోర్టు ఆధారంగా వారిపై చర్చలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. రేపు జరిగే తెలంగాణ కేబినెట్ లో కాళేశ్వరం అంశం చర్చకు రానుంది.

కాగా, కాళేశ్వరం అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తాము విజిలెన్స్, NDSA నివేదికలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఈ అంశంపై కేంద్రాన్ని ఇప్పటికే సీబీఐ విచారణ కోరామని గుర్తు చేశారు. 9 నెలలవుతున్నా సీబీఐ విచారణ చేయడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం (Kaleshwaram) కూలిన సంగతి అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్రం నుంచి స్పందన లేదని తెలిపారు. ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని స్పష్టం చేశారు.

Read Also: తిరుపతి వెళ్తున్నారా.. ఇవిగో స్పెషల్ ట్రైన్స్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>