Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. గత కొంతకాలంగా కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విజిలెన్స్ సీఐలు దశరథ, మనోహర్ నేతృత్వంలోని బృందం కార్యాలయంలోని జనరల్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, నిబంధనల అమలు, డాక్యుమెంట్ల నిర్వహణపై అధికారులు ఆరా తీస్తున్నారు.

అయితే, ఇవి కేవలం విజిలెన్స్ సోదాలని, ఏసీబీ దాడులు కావని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సోదాల సమయంలో కార్యాలయంతో ఎటువంటి సంబంధం లేని ఆరుగురు బయటి వ్యక్తులు అక్కడ ఉండటాన్ని గమనించిన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనధికార వ్యక్తుల ప్రమేయంపై విచారణ చేపడుతున్నారు. వీరి పాత్ర ఏమిటి? వీరు ఎవరి తరఫున కార్యాలయంలో తిష్ట వేశారు? అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, రికార్డుల పరిశీలన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు.

Read Also: కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>