తిరుపతి వెళ్తున్నారా.. ఇవిగో స్పెషల్ ట్రైన్స్!

కలం, వెబ్ డెస్క్: వేసవి కాలంలో తిరుపతి (Tirupati) శ్రీవారి దర్శనార్థం రాష్ట్రం నుంచి వేలాది మంది వెళ్తుంటారు. దీంతో, అటు వైపు వెళ్లే రైళ్లు ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. చర్లపల్లి, కాచిగూడ నుంచి తిరుపతికి ఈ నెల 14వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడపబోతున్నపట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీనితో పాటు తెలంగాణ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచుతూ 8 కొత్త రైలు సర్వీసులను ప్రారంభించనుంది. కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి తిరుపతి, తిరుచానూరు, భువనేశ్వర్, జైపూర్, శ్రీ గంగానగర్ వంటి నగరాలకు ఈ వీక్లీ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

కొత్త రైళ్ల వివరాలు ఇవే..

• చర్లపల్లి → తిరుపతి (Tirupati) (బుధవారం రాత్రి 9.20 గంటలకు) – 14 మే 2026 నుంచి,
• చర్లపల్లి → తిరుపతి (శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు) – 15 మే 2026 నుంచి,
• చర్లపల్లి → తిరుచానూరు (బుధవారం సాయంత్రం 6.55 గంటలకు) – 7 మే 2026 నుంచి,
• చర్లపల్లి → తిరుచానూరు (ఆదివారం రాత్రి 9.15 గంటలకు) – 11 మే 2026 నుంచి,
• కాచిగూడ → తిరుచానూరు (గురువారం రాత్రి 9.30 గంటలకు) – 15 మే 2026 నుంచి,
• కాచిగూడ → శ్రీ గంగానగర్ (శనివారం రాత్రి 10.00 గంటలకు) – 14 జూలై 2026 నుంచి,
• చర్లపల్లి → భువనేశ్వర్ (సోమవారం సాయంత్రం 6.10 గంటలకు) – 5 మే 2026 నుంచి,
• నాంపల్లి → జైపూర్ (శుక్రవారం రాత్రి 7.50 గంటలకు) – తేదీ త్వరలో ప్రకటించనున్నారు.

Read Also: కల్వకుంట్ల ఫ్యామిలీలో పొలిటికల్ వార్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>