Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి డైరెక్టర్‌గా కాకతీయ రజనీకాంత్

కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) పాలకమండలి డైరెక్టర్‌గా కాకతీయ రజనీకాంత్ నియమితులయ్యారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ద్వితీయ శ్రేణి సభ్యులతో కూడిన పాలక మండలిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ యాక్ట్ 1991 ప్రకారం నూతనంగా పాలక మండలి సభ్యులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి నామినేటెడ్ కోటాలో డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మెనేజ్ మెంట్ ప్రొఫెస‌ర్ ఆంజనేయులు, యూనివర్సిటీలోని ఒక‌ విభాగం ప్రిన్సిపాల్‌ను నామినేట్ చేయాల్సిన కోటా జియో ఇన్ఫర్మేటిక్స్ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డా.సుధాకర్ గౌడ్, అఫిలియేట్ కాలేజీల తరఫున‌ ఒక ప్రిన్సిపాల్‌గా గౌతమి కాలేజీ ప్రిన్సిపాల్ డా.కే.సంజీవ రావు, యూనివర్సిటీ పరిధిలోని ఒక కాలేజీ లెక్చరర్‌గా గిరిరాజ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దండు స్వామిని, అఫిలియేటెడ్ కాలేజీల నుంచి ఒక అధ్యాపకుడిగా ఇందూర్ పీజీ కాలేజ్ ఆఫ్ బిజినెస్ మెనేజ్‌మెంట్ మెంట్ కాలేజీ ప్రొఫెస‌ర్‌ మదన్ మోహన్‌ను, నామినేట్ చేశారు. యూనివర్సిటీ పరిధిలోని వాణిజ్య, వ్యాపార, వ్యవసాయ, విద్యావేత్తలతో పాటు సామాజిక రంగాల్లో నిష్ణాతుల కేటగిరిలో కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ చెరుకూరి రజనీ కాంత్, మహమ్మద్ ఘాజీ, డా.ఎస్ జయంత్‌ను నియమించారు. నియామకాల పట్ల వారంతా హర్షం వ్యక్తం చేశారు.

Read Also: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏడీఈ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>