Mobile Popup Ad
Mobile Popup Ad

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏడీఈ

కలం, దేవరకొండ: అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో అవినీతి చేపను పట్టుకున్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ (Devarakonda)లో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ADE) సైదులు గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. దేవరకొండ విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏడీఈగా పని చేస్తున్న సైదులు ఒక విద్యుత్ కాంట్రాక్టర్‌కు సంబంధించిన అధికారిక ఫైల్‌ను క్లియర్ చేయడానికి రూ.30వేలు లంచం డిమాండ్ చేశారు. సదరు కాంట్రాక్టర్ లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా వ్యుహంతో ఏసీబీ అధికారులు గురువారం నిఘా పెట్టారు.

కాంట్రాక్టర్ నుంచి ఏడీఈ సైదులు (ADE Saidulu) లంచం సొమ్ము తీసుకుంటుండగా అధికారులు మెరుపు దాడి చేసి, ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు సైదులు నుంచి రూ.30వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దేవరకొండలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. గతంలో ఏవైనా ఫైళ్ల విషయంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారా? అనే కోణంలో రికార్డులను పరిశీలిస్తున్నారు. కాగా, ఏడీఈ సైదులును అదుపులోకి తీసుకున్న అధికారులు, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నారు.

Read Also: ఆత్మరక్షణలో బీజేపీ.. జీహెచ్ఎంసీలో నెగెటివ్ ఎఫెక్ట్..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>