నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తోనే ప్రమాదాలు: ఏసీపీ వసుంధర యాదవ్

కలం, ఖమ్మం బ్యూరో: నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తోనే ప్రమాదాలు జ‌రుగుతున్నాయ‌ని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ (ACP Vasundhara Yadav) తెలిపారు. గురువారం అరైవ్ అలైవ్ (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కల్లూరు (Kalluru)లో ఏసీపీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో కలసి రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రహదారి భద్రతా చర్యల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన లోపం వల్ల రోడ్డు ప్రమాదాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయన్నారు. నిర్ణీత వేగ పరిమితిని పాటించడం ద్వారా మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రక్షించవచ్చన్నారు.

నిర్లక్ష్య డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం లేకపోవడం, ఓవర్ టేక్ వంటి కారణాల వల్ల ప్ర‌మాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్బంగా రోడ్డు ఆక్రమణదారులకు ఏసీపీ (ACP Vasundhara Yadav) నోటీసులు అందజేశారు. కార్యక్రమంలో కల్లూరు ఎస్సై హరిత, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ ధరావత్ మోహన్ నాయక్, మున్సిపాలిటీ మేనేజర్ నందిశెట్టి నాగేశ్వరరావు, బిరవల్లి మాధవ్, స్థానికులు పాల్గొన్నారు.

Read Also: ఆత్మరక్షణలో బీజేపీ.. జీహెచ్ఎంసీలో నెగెటివ్ ఎఫెక్ట్..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>