కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి (ఏప్రిల్ 16) నుంచి ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్వయంగా తన వివరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. హౌస్ లిస్టింగ్ – హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారిక పోర్టల్ (http://se.census.gov.in) ద్వారా సీఎం తన కుటుంబానికి సంబంధించిన వివరాలను నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్ జె. నివాస్ ముఖ్యమంత్రికి వివరించారు.
ప్రజలు సులభంగా తమ ఇళ్ల వివరాలను నమోదు చేసుకునేలా ఈ ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్ర ప్రజలకు స్వయంగా తమ గృహ వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా జనగణన ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, పారదర్శకతను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.
Read Also: ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపికబురు
Follow Us On: Instagram

