కలం, వెబ్ డెస్క్: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కైలాస్ మానసరోవర్ యాత్ర (Kailash Mansarovar Yatra) వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతుంది. ఆగస్ట్ వరకు కొనసాగే ఈ యాత్ర కోసం మొత్తం వెయ్యి మందిని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ (Jaishankar) కంప్యూటర్ ఎంపిక లాట్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసినట్లు అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. బ్యాచ్‌లు, మార్గాల వివరాలు కైలాస్ మానసరోవర్ యాత్ర అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని.. మహిళలు, పురుషులకు సమాన ప్రాధాన్యత కల్పించినట్లు వెల్లడించారు. ఎంపికైన వెయ్యి మందిని 20 బ్యాచ్‌లుగా విభజించారు. ప్రతి బ్యాచ్‌లో 50 మంది యాత్రికులు ఉంటారు. లిపులేఖ్ పాస్, నాథులా పాస్ మార్గాల ద్వారా యాత్ర కొనసాగనుంది. ప్రస్తుతం ఈ రెండు మార్గాలే వాహనాలు వెళ్లేందుకు అనువుగా ఉన్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
యాత్ర ప్రారంభాన్ని స్వాగతించిన చైనా..
కైలాస్ మానస సరోవర్ యాత్ర (Kailash Mansarovar Yatra) పునఃప్రారంభాన్ని చైనా స్వాగతించింది. ఈ మేరకు చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ స్పందిస్తూ.. యాత్రలో పాల్గొనే భారతీయులకు చైనా సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. ఈ యాత్ర భారత్-చైనా ప్రజల మధ్య స్నేహం, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేస్తుందని చైనా ప్రతినిధి అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, భారత విదేశాంగ శాఖ చైనా ప్రభుత్వంతో కైలాస్ మానసరోవర్ యాత్ర–2026 జూన్ నుంచి ఆగస్టు మధ్య నిర్వహించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 30న విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. హిందువులకు పరమ పవిత్ర క్షేత్రంగా భావించే కైలాస్ మానసరోవర్ యాత్ర జైనులు, బౌద్ధులకు కూడా ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉంది.
Read Also: కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు! … ప్రధాని ఏమన్నారంటే?
Follow Us On : WhatsApp

