పంజాబీ నటి ప్రేమలో భారత క్రికెటర్‌ అర్షదీప్ సింగ్

కలం, వెబ్ డెస్క్: టీమ్ ఇండియా స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) ప్రేమలో ఉన్నాడంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల అర్ష్‌దీప్ తన స్నాప్‌చాట్‌లో ఓ ఫోటోను షేర్ చేశాడు. అందులో అతను ఒక యువతి చేతిని పట్టుకుని కనిపించాడు. అయితే ఆ ఫోటోలో ఉన్న యువతి చేతిపై ఉన్న ఒక ప్రత్యేకమైన టాటూ ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. పంజాబీ మోడల్, నటి సమ్రీన్ కౌర్ చేతిపై కూడా సరిగ్గా అలాంటి టాటూనే ఉండటంతో, ఆ యువతి సమ్రీన్ అని ఫ్యాన్స్ నిర్ధారణకు వచ్చారు.

అయితే ఇటీవల ముల్లాన్‌పూర్‌లో జరిగిన పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా సమ్రీన్ కౌర్ (Samreen Kaur) స్టేడియంలో సందడి చేసింది. పంజాబ్ కింగ్స్ జెర్సీని ధరించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. దీంతో అర్ష్‌దీప్ (Arshdeep Singh), సమ్రీన్ ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ ప్రచారంపై వీరిద్దరి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

Read Also: ‘తనను తాను ప్రేమించలేని వాడు.. ఇతరులను ప్రేమించలేరు’ ఇందులో వాస్తవం ఎంత?

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>