డ్రాగన్ లోడింగ్.. కండలు తిరిగిన బాడీతో షాకిస్తున్న ఎన్టీఆర్

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకుడిగా రాబోతున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ సిద్ధమవుతున్న తీరు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘దేవర’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం తన బాడీని పూర్తిగా మార్చుకున్నారు. తాజాగా విడుదలైన ఫోటోలో ఎన్టీఆర్ ఎంతో ఫిట్‌గా, కండలు తిరిగిన వీపు బైసెప్స్‌తో బీస్ట్ మోడ్‌లో కనిపిస్తున్నారు. ‘Built. Not bought’ అంటూ తారక్ స్వయంగా షేర్ చేసిన ఈ లుక్ చూస్తుంటే, ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో అర్థమవుతోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ (Jr NTR) బాలీవుడ్ చిత్రం ‘వార్-2’ షూటింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుకు అవసరమైన మేకోవర్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సినిమా కోసం తారక్ కఠినమైన వర్కౌట్లు చేయడం చేస్తున్నాడు. దీనికి కోసం మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మార్క్ ఎలివేషన్లకు, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ తోడైతే వెండితెరపై బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Also: బీ అలర్ట్.. మహిళలకు నిద్రతక్కువైతే ఈ హెల్త్ ఇష్యూస్ అటాక్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>