Mobile Popup Ad
Mobile Popup Ad

డ్రైఫ్రూట్స్ ఎక్కువ తిన్నా బరువు పెరుగుతామా?

కలం, వెబ్ డెస్క్: డ్రైఫ్రూట్స్‌ (Dry Fruits)ను హెల్తీ డైట్‌గా అందరూ చెప్తారు. బరువు తగ్గడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని కూడా నిపుణులు చెప్తారు. కానీ డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తింటే ఏమవుతుంది? మితిమీరితే అవి కూడా మన బరువును పెంచేస్తాయా? ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయి. చాలా మంది దీనిని నమ్ముతుంటారు కూడా. ఈ విషయంలో యూకేకు చెందిన ప్రముఖ సర్జన్, హెల్త్ కంటెంట్ క్రియేటర్ డాక్టర్ కరణ్ రాజన్ (Dr Karan Rajan) క్లారిటీ ఇచ్చారు. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఇది కేవలం అపోహ మాత్రమేనని, సాధారణంగా నట్స్ అధికంగా తీసుకున్నా బరువు పెరగరని ఆయన స్పష్టం చేశారు.

నట్స్ నుండి వచ్చే కేలరీలను మన శరీరం 100 శాతం గ్రహించలేదని డాక్టర్ రాజన్ వివరించారు. ఉదాహరణకు, ఒక గుప్పెడు బాదం పప్పులలో 170 కేలరీలు ఉన్నట్లు ప్యాకెట్ మీద రాసి ఉన్నా, మన శరీరానికి కేవలం 120 కేలరీలు మాత్రమే అందుతాయని తెలిపారు. అమెరికా వ్యవసాయ శాఖ (USDA) జరిపిన పరిశోధనల ప్రకారం, ప్యాకెట్ల మీద పేర్కొన్న దానికంటే 32 శాతం తక్కువ కేలరీలే మన శరీరానికి చేరుతాయి. నట్స్‌ను ఎలా తీసుకుంటున్నాం అనే దానిపైనే కేలరీల గ్రహింపు ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. దీనిని బాదం పప్పుల ఉదాహరణతో ఇలా వివరించారు.

పూర్తి బాదం పప్పులు: గ్రాముకు 4.6 కేలరీలు మాత్రమే అందుతాయి. వేయించి ముక్కలు చేసినవి అయితే గ్రాముకు దాదాపు 5 కేలరీలు అందుతాయి. నట్ బట్టర్ (వెన్న)లో గ్రాముకు పూర్తిస్థాయిలో 6.1 కేలరీలు అందుతాయి. నట్స్ సహజ రూపంలో ఉన్నప్పుడు వాటిలోని కొవ్వు కణాలు దృఢమైన కవచాల లోపల ఉంటాయని, వీటిని మన జీర్ణవ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నం చేయలేదని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల కొంత కొవ్వు అరగకుండానే శరీరం నుండి బయటకు వెళ్లిపోతుంది.

ఒక్కొక్కరి జీర్ణక్రియ సామర్థ్యం ఒక్కోలా ఉంటుందని, ఆహారాన్ని ఎంత బాగా నమిలి తింటున్నాం, మన కడుపులోని బ్యాక్టీరియా ఎలా ఉంది అనే అంశాలు కేలరీల గ్రహింపును ప్రభావితం చేస్తాయని డాక్టర్ రాజన్ తెలిపారు. ఒకే రకమైన బాదం పప్పులు ఒకరికి 56 కేలరీలను ఇస్తే, మరొకరికి 168 కేలరీలను ఇవ్వవచ్చని ఆయన ఉదాహరించారు. నట్స్‌లో గుండెకు మేలు చేసే కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని, అందుకే వీటిని పరిమిత పరిమాణంలో క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయన సూచించారు. ఏ వస్తువైనా అతిగా తీసుకోవడం మంచిది కాదని చెబుతూనే, నట్స్ ఆరోగ్యకరమైన స్నాక్ ఆప్షన్ అని ఆయన ముగించారు.

Read Also: బీ అలర్ట్.. మహిళలకు నిద్రతక్కువైతే ఈ హెల్త్ ఇష్యూస్ అటాక్!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>