కలం, వెబ్ డెస్క్ : ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తరువాత దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయని కేంద్రమంత్రి జేపీ నడ్డా (JP Nadda) అన్నారు. గురువారం బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో బీజేపీ కీలక నేలతో ఏర్పాటు చేసిన సమావేశంలో నడ్డా మాట్లాడారు. దేశంలో 80 కోట్ల మందికి ఆహార భద్రత కల్పిస్తున్నామని ఆయన గుర్తు చేశారు.
గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా తెలంగాణలో కోటి 20లక్షల మందికి రేషన్ అందిస్తున్నామన్నారు. ప్రధాని ఆవాస్ యోజన కింద సుమారు 4 లక్షల ఇళ్లు కట్టించామని చెప్పారు. కిసాన్ సమ్మాన్ నిధి, జల్ జీవన్ మిషన్ లాంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీ పాలనలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని జేపీ నడ్డా తెలిపారు.

