Mobile Popup Ad
Mobile Popup Ad

రేపు క్యాబినెట్ భేటీ.. చర్చించే అంశాలు ఇవే!

కలం, వెబ్ డెస్క్ : రేపు (శుక్రవారం) ఏపీ మంత్రివర్గం (AP Cabinet) సమావేశం కానుంది. ఉదయం ఉదయం 10.30 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో భేటీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగబోయే మీటింగ్ లో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అశకాశం ఉంది. ఇందులో ప్రదానంగా రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన ల్యాండ్ పూలింగ్ రైతులకు భారీ ఊరట కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

రాజధానికి కొత్తగా భూములిచ్చేవారికి ఎకరానికి ఏడాదికి రూ.40 వేల యాన్యుటీ ఇచ్చేందుకు మంత్రి వర్గం (AP Cabinet) ఆమోదం తెలుపనుంది. గ్రామ కంఠాల్లో భూములు కోల్పోయినవారికి నెలకు రూ.10 వేల అద్దె భత్యం చెల్లించేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పెట్టుబడులు, మౌళిక సదుపాయాలు, వివిధ శాఖలకు సంబంధించిన కీలక ప్రతిపాదనలపై క్యాబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా, తొలుత ఈ నెల 8వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావించి ఆ తరువాత రేపటికి (జులై 10) వాయిదా వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>