Mobile Popup Ad
Mobile Popup Ad

కేసీఆర్ నాలుకకు రంధ్రాలు ఉంటే బాగుండు : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో:  నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR) పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘కేసీఆర్ (KCR) నాలుకకు రంధ్రాలు ఉంటే బాగుండేది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి, రాష్ట్రంలో మరెవరికీ రాని అబద్ధాలు కేసీఆర్ కుటుంబానికే వస్తాయని ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోయిన నిరాశలోనే కేసీఆర్ అర్థరహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

మూసీ నది ప్రక్షాళన, అభివృద్ధి ప్రాజెక్టుపై ప్రభుత్వం వెనక్కి తగ్గేదే లేదని మంత్రి (Minister Komatireddy) స్పష్టం చేశారు. మూసీ తెలంగాణకు జీవనదిగా పేర్కొంటూ, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని అభివృద్ధి చేసి తీరుతామని చెప్పారు. ఈ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే నల్గొండ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల భారంతో కుదేలైందని, ఇప్పుడు రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలిపారు.

పొరపాటున కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే తెలంగాణ అప్పుల కూపంగా మారుతుందని, ఆ పరిస్థితిలో రాష్ట్రాన్ని కాపాడటం కష్టమవుతుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మరో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Read Also: కేసీఆర్, రేవంత్‌రెడ్డిపై రామ్‌చందర్‌రావు తీవ్ర విమర్శలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>