Mobile Popup Ad
Mobile Popup Ad

రావాల్సిన నిధులపై రాజీ లేదు.. ఎంపీలతో జితేందర్‌రెడ్డి భేటీ

కలం, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, నిరంతరం సంప్రదింపులతో సాధించుకోవాలని కాంగ్రెస్ ఎంపీలకు (Congress MPs) రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి (Jithender Reddy) స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధి పాత్రకు మాత్రమే పరిమితం కాకుండా సెంటర్, స్టేట్ మధ్య సంబంధాల కోసం ప్రత్యేకంగా ఏర్పడిన కోఆర్డినేషన్ కమిటీ పర్యవేక్షణ బాధ్యతలు కూడా చూస్తున్న జితేందర్‌రెడ్డి ప్రస్తుతం లోక్‌సభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏయే మంత్రిత్వశాఖ నుంచి ఏయే పథకం కింద ఎన్ని నిధులు రావాలో వివరాలను వివరించి వాటిని వీలైనంత తొందరగా మంజూరు చేయించుకునేలా ఆయా శాఖల మంత్రులతో మాట్లాడాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధులు రాబట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోఆర్డినేషన్ సెక్రెటరీగా అద్వైత్ కుమార్ సింగ్ నియమితులైన తర్వాత జరిగిన తొలి సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది.

కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, హక్కులపై ప్రధానంగా దృష్టి పెట్టారు. విభజన చట్టంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పుష్కర కాలంలో అమలులోకి వచ్చినవేవి, ఇంకా పెండింగ్‌లో ఉన్నవేవి.. ఇలాంటివాటిపై లోతుగా చర్చ జరిగింది. ప్రభుత్వ ప్రాధాన్యతలను ఎంపీలకు జితేందర్ రెడ్డి (Jithender Reddy) వివరించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు, ఇతర కీలక అంశాలతో పాటు పెండింగ్ సమస్యలు వీలైనంత తొందరగా పరిష్కారమయ్యేలా ఎంపీలు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, రామసహాయం రఘురామిరెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ శశాంక్ గోయల్, కోఆర్డినేషన్ విభాగం సెక్రటరీ అద్వైత్ కుమార్ సింగ్, తెలంగాణ భవన్ అధికారులు పాల్గొన్నారు.

Read Also: గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. సెంట్రల్ ఫండ్స్ రిలీజ్

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>