Mobile Popup Ad
Mobile Popup Ad

మాటకు కట్టుబడి రాజీనామా చేయాలి.. కేటీఆర్ పై సీతక్క ఫైర్

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అసెంబ్లీ వేదికగా తన మాటకు కట్టుబడి రాజీనామా చేయాలని మంత్రి సీతక్క (Seethakka) డిమాండ్ చేశారు. మహిళా సంఘాలకు రూ.57 వేల కోట్ల బ్యాంకింగ్ రుణాలు ఇస్తే రాజీనామా చేస్తా అన్నారని.. ఇదిగో ఆధారాలు అంటూ ఫైర్ అయ్యారు. బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు ఈ రెండు సంవత్సరాలలో రూ.57 వేల కోట్లు విడుదల చేశామని స్పష్టం చేశారు. మహిళా సంఘాల రుణాలపై వడ్డీ భారాన్ని కూడా భరిస్తున్నామని మంత్రి చెప్పారు.

మహిళా సంఘాల రుణాలపై ఇప్పటివరకు రూ.1,390 కోట్ల వడ్డీ చెల్లించామని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో రూ.4 వేల కోట్ల వడ్డీలు ఎగ్గొట్టారని.. అభయహస్తం నిధులు కాజేశారని సీతక్క (Seethakka) ఆరోపించారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, అందినకాడికి దోచుకున్న బీఆర్ఎస్ నాయకులు.. ఇవాళ ప్రజా ప్రభుత్వంపై బురద చల్లుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందుతున్నా.. కావాలని బద్నాం చేయడం బీఆర్ఎస్ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read Also: వెలుగుమట్ల బాధితులందరికీ నిజ నిర్ధారణ కమిటీతోనే న్యాయం: కవిత

Follow Us On: Pinterest

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>