గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. సెంట్రల్ ఫండ్స్ రిలీజ్

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు (Panchayat Funds) విడుదలయ్యాయి. మొత్తం ఐదు రాష్ట్రాలకు కలిపి రూ. 1,789 కోట్లు విడుదల చేయగా అందులో తెలంగాణ వాటా రూ. 256.21 కోట్లు. ఇప్పటికే రెండు విడతల్లో రూ. 259.36, రూ. 387.53 కోట్ల చొప్పున విడుదలయ్యాయి. తాజాగా మూడవ విడతగా రూ. 256.21 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ తెలిపారు. తాజాగా విడుదల చేసిన మొత్తం 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌గా పేర్కొన్నది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యి కొత్తగా సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొత్తం మూడు విడతల్లో 15వ ఆర్థిక సంఘం (15th Finance Commission) నిధులు విడుదలయ్యాయి. దాదాపు రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో విడుదలయ్యాయి.

గ్రామాల్లో సౌకర్యాల కోసమే ఖర్చు చేయాలి :

ఆర్థిక సంఘం నుంచి విడుదలైన నిధులను (Panchayat Funds) ఉద్యోగుల వేతనాలు, ఇతర ఎస్టాబ్లిష్‌మెంట్ అవసరాల కోసం ఖర్చు చేయకూడదని, కేవలం గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాల కోసమే వెచ్చించాలన్నది నిబంధన. పారిశుద్యం, మరుగుదొడ్ల నిర్వహణ, చెత్త సేకరణ, తాగునీరు, వర్షపు నీటి నిర్వహణ, వాటర్ రీసైక్లింగ్ తదితరాలకు వినియోగించాల్సి ఉంటుంది. గ్రామానికి ఉమ్మడిగా ఉపయోగపడే అవసరాలపై నిర్దిష్టంగా 29 అంశాలు ఉన్నందున వాటి కోసం మాత్రమే ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖల సూచన మేరకు ఈ నిధులు విడుదలయ్యాయి.

Read Also: బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన కాంగ్రెస్

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>