కలం వెబ్ డెస్క్ : కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ(KPHB)లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం( Venkateswara Swamy Temple)లో నగలు చోరీ(Theft) అయ్యాయి. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి మూలవిరాట్టుకు సంబంధించిన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఆభరణాల విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని సమాచారం. ఇందులో 15 తులాల వెండి, 3 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అర్చకులు బుధవారం తెల్లవారుజామున ఆలయంలో పూజ చేసే సమయంలో ఆభరణాలు లేకపోవడాన్ని గుర్తించారు. దొంగతనం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఫుటేజ్‌లో ఓ మహిళ, మరో వ్యక్తి ఉన్నారు. అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


