Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీలో గ్యాస్ సరఫరాపై సీఎం కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి  చంద్రబాబు (Chandrababu) గ్యాస్ సరఫరా పరిస్థితిపై సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇంధన భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ వనరుల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఇందులో భాగంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగాన్ని విస్తృతంగా పెంచాలని అధికారులను ఆదేశించారు.

పీఎన్జీ కనెక్షన్లు గృహాలకు స్థిరమైన, సురక్షితమైన ఇంధన సరఫరాను అందిస్తాయని, భవిష్యత్తులో ఇది ఉత్తమ పరిష్కారమని సీఎం చంద్రబాబు (Chandrababu) అభిప్రాయపడ్డారు. దీపం పథకం లబ్ధిదారులు పీఎన్జీకి మారినా వారికి యథావిధిగా రాయితీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అదేవిధంగా వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

Read Also: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఏపీ ప్రభుత్వం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>