కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీకి ధనిక రాష్ట్రం అప్పగిస్తే రూ.8 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ప్రశ్నించారు. గత ప్రభుత్వ నాయకులకు సరైన ఆలోచన, అవగాహన లేక రాష్ట్రానికి తీవ్ర నష్టం చేశారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయని హరీశ్ రావు చెబుతున్న మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. రూ.80 వేల కోట్ల అంచనా వ్యయం ఉన్న ప్రాజెక్టులో కేవలం రూ.25 వేల కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులు ఎలా పూర్తి చేశారు? అని ప్రశ్నంచారు. కనీసం కాలువల నిర్మాణం పూర్తి చేయలేదని దుయ్యబట్టారు.
భూసేకరణ చేపట్టలేదని.. పరిపాలనా అనుమతులు కూడా లేవని చెప్పారు. ఎన్నికల ముందు హడావుడిగా పంపులు ఆన్ చేసి ప్రజలను వంచించారు తప్ప, ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చారా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరుపై రూ. 7 వేల కోట్లు ఖర్చు చేస్తే, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రూ. 8,300 కోట్లు వెచ్చించాయని తెలిపారు. గొల్లపల్లి రిజర్వాయర్ (Gollapalli Reservoir) భూసేకరణలో భాగంగా 2.5 శాతం మంది రైతులకు మాత్రమే నష్టం వాటిల్లుతోందని.. కానీ 97.5 శాతం మంది రైతులకు ప్రయోజనం చేకూరుతోందని ఆయన (Jupally Krishna Rao) వివరించారు.
Read Also: ఫోన్లు వదలని పిల్లలు.. పేరెంట్స్కు పరీక్ష
Follow Us On: Facebook

