Mobile Popup Ad
Mobile Popup Ad

కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన జీవన్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: జగిత్యాలలో బీఆర్ఎస్ తలపెట్టిన భారీ ప్రజా ఆశీర్వాద సభ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సోమవారం మధ్యాహ్నం జగిత్యాలలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి చేరుకున్న పార్టీ అధినేత కేసీఆర్, అక్కడ కొద్దిసేపు పార్టీ ముఖ్యనేతలతో చర్చించారు. అనంతరం జీవన్ రెడ్డితో (Jeevan Reddy) కలిసి ప్రత్యేక బస్సులో సభకుబయలుదేరారు. టీ జీవన్ రెడ్డి.. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జీవన్ రెడ్డికి కేసీఆర్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జీవన్ రెడ్డితోపాటు ప్రధాన అనుచరులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

దాదాపు ఏడాది కాలం తర్వాత కేసీఆర్ (KCR) బహిరంగ సభలో ప్రసంగించనుండటం, అలాగే సీనియర్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) గులాబీ కండువా కప్పుకోవడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టణమంతా గులాబీ తోరణాలతో నిండిపోగా, భారీ జనసందోహం మధ్య కేసీఆర్ సభ మొదలైంది.

Read Also: జీవన్ రెడ్డికి కీలక పదవి.. ప్రకటించిన కేసీఆర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>