‘CASTE’ మూవీ నుంచి రంగరాజన్ గా నాగబాబు పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

కలం, వెబ్ డెస్క్ : వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి ప్రధాన పాత్రల్లో ఎకె జంపన్న రచన దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘CASTE’. ఇటీవల రిలీజైన  ఈ సినిమా ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆయన పాత్రని రంగరాజన్ గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. నల్ల దుస్తుల్లో, మెడలో రుద్రాక్షమాల, నుదుటిపై తిలకం ధరించి, ఇంటెన్స్ గా చూస్తున్న నాగబాబు లుక్ పవర్ ఫుల్ గా ఉంది.

రంగరాజన్ పాత్రలో నాగబాబు (Nagababu) కనబడిన తీరు కమాండ్, అథారిటీని చూపిస్తోంది. ఇందులో ఆయన పాత్ర నిర్భయంగా, కులాలకు అతీతమైన మానవత్వంతో ఉండబోతుందని వినికిడి. కాగా, ఈ చిత్రంలో కశికా కపూర్, దివి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.

Read Also: యూరియా యాప్‌తో రైతుల కాళ్లకు వాపులు: కేసీఆర్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>