Mobile Popup Ad
Mobile Popup Ad

బీజేపీ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోంది: ఎంపీ కడియం కావ్య

కలం, వరంగల్ బ్యూరో: బీజేపీ (BJP) రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని వరంగల్ ఎంపీ కడియం కావ్య (MP Kadiyam Kavya) విమర్శించారు. హనుమకొండలోని డీసీసీ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీ నాయకులు మహిళల పట్ల ప్రేమ ఉన్నట్లు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. మహిళల పక్షపాతి కాంగ్రెస్ అని, బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు స్వర్ణ మాట్లాడుతూ బీజేపీ నాయకులు మహిళ బిల్లు (Women Reservation Bill)ను ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే కుట్ర చేశారని ధ్వ‌జమెత్తారు. మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో బీజేపీ విఫలం అయిందన్నారు.

మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. దేశసమగ్రత దెబ్బ తీయటం కోసమే బీజేపీ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. బీజేపీ నేతలు కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకం అంటూ దుష్ప్ర‌చారం చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. థర్డ్ క్లాస్ పార్టీ టికెట్లు, దొంగల ముఠాకు కేరాఫ్ బీజేపీ అన్నారు. కేంద్రంలోని బీజేపీ తెలంగాణ అభివృద్ధి కి కేటాయించిన నిధులు ఎంతో లెక్క చెప్పాలన్నారు. ఓట్ల కోసం మోదీ దొంగనాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. బీజేపీ మహిళా బిల్లు పేరుతో దక్షాణాదిపై కుట్ర చేశారన్నారు. ఏప్రిల్ 17 అవమానకరమైన రోజు అని ఆయన పేర్కొన్నారు.

 Read Also: వేసవిలో పొలిటికల్ హీట్.. ఉమ్మడి ‘కరీంనగర్‌’లో కేసీఆర్, రేవంత్ పర్యటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>