కలం, వెబ్ డెస్క్ : రీల్స్ పిచ్చి ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో చోటుచేసుకుంది. మౌగంజ్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం సోషల్ మీడియా వ్యామోహం ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో మరోసారి హెచ్చరించింది.
పల్సర్ బైకుపై అతివేగంతో ప్రయాణిస్తూ, చేతిలో నాటు తుపాకీ పట్టుకుని విన్యాసాలు చేస్తూ వీడియో తీసుకుంటున్న క్రమంలో ఈ ఘోరం జరిగింది. బైకు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిని అనుసరిస్తూ వీడియో తీస్తున్న మరో బైకు కూడా అదే ట్రక్కును ఢీకొనడంతో దానిపై ఉన్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Read Also: ఆరేళ్ల కొడుకును చంపిన తండ్రి.. కారణం తెలిస్తే షాక్!
Follow Us On: X(Twitter)

