నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష.. 1.90 లక్షల మంది హాజరు

కలం, వెబ్ డెస్క్ : నేడు దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 (JEE Advanced 2026) పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు సుమారు 1.90 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. దేశంలోని ప్రముఖ ఐఐటీలలో ప్రవేశం కోసం నిర్వహించే ఈ పరీక్షను కఠినమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 45 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు అధికారులు తెలిపారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 (JEE Advanced 2026) పేపర్ 1 ఉదయం 9 గంటలకు, పేపర్ 2 మధ్యాహ్నం 2:30 గంటలకు జరుగుతుంది. విద్యార్థులు రాయవలసిన రెండు ప్రశ్నపత్రాలు ఒక్కొక్కటి 3 గంటల వ్యవధి కలిగి ఉంటాయి. దీనితో విద్యార్థులు తమ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డులో పేర్కొన్న రిపోర్టింగ్ సమయం ప్రకారం, వారికి కేటాయించిన పరీక్షా కేంద్రానికి హాజరవుతున్నారు. ఈ పరీక్ష ఫలితాలు జూన్ 1న విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఫలితాల ఆధారంగా IITలలో సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.

Read Also: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్‌కు సెన్సార్ క్లియరెన్స్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>