ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్‌కు సెన్సార్ క్లియరెన్స్

కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్-నీల్’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి శంకర్, యెర్నేని నవీన్.. నందమూరి ఆర్ట్స్ బ్యానర్‌పై  నందమూరి కళ్యాణ్ రామ్, హరి కృష్ణ కొసరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ (Dragon) అనే పవర్ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉంది.

ఇదిలా ఉంటే మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. తాజాగా డ్రాగన్ గ్లింప్స్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మూవీ గ్లింప్స్‌కు సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ 16+ సర్టిఫికెట్ లభించింది. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఈ గ్లింప్స్ వీడియోకు అనుమతి మంజూరు చేసింది. సెన్సార్ వివరాల ప్రకారం, ఈ గ్లింప్స్ నిడివి 4.35 నిమిషాలుగా ఉంది. సర్టిఫికేట్ నంబర్ DIS/7/33/2026-HYD కాగా, మే 15, 2026న సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ గ్లింప్స్‌కు సంబంధించిన అప్‌డేట్ బయటకు రావడంతో అభిమానులలో మరింత ఆసక్తి నెలకొంది. చిత్ర (NTR Dragon) బృందం త్వరలో మరిన్ని అధికారిక వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

Read Also: ‘పెద్ది’ మూవీ రన్‌టైమ్‌పై కీలక అప్‌డేట్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>