బీహార్ ఎన్నికల్లో(Bihar Elections) తమ అభ్యర్థుల తుది జాబితాను జేడీయూ గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 44 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. రెండో జాబితో పలువురు మంత్రులకు టికెట్ అందించింది. షీలా మండల్, విజేంద్ర ప్రసాద్ యాదవ్, లేషి సింగ్, జయంత్ రాజ్, మహమ్మద్ జమాఖాన్ కు చోటు దక్కింది. 243 అసెంబ్లీ స్థానాలకు గాను 101 స్థానాల్లో జేడీయూ(JDU) పోటీ చేస్తోంది. బుధవారం 57 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. గురువారం మిగిలిన 44 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బిహార్ లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Read Also: కృతి సనన్‌కు అరుదైన గౌరవం.. తొలి నటిగా రికార్డ్..

