epaper
Tuesday, November 18, 2025
epaper

రేవంత్ ప్రభుత్వంపై హైకోర్టు హైప్రెజర్..!

రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వంపై స్థానిక ఎన్నికల(Local Body Polls) భారం రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రభుత్వం ముందు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్‌గా కూడా ఈ ఎన్నికలు మరాయి. ఒకవైపు ఈ ఎన్నికలు నిర్వహించాలంటే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉంది. దీంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అన్న అంశంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఇంతలోనే స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలంటూ హైకోర్టు(TG High Court).. తెలంగాణ ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీంతో తమకు రెండు వారాల సమయం ఇవ్వాలని సర్కార్, ఎన్నికల సంఘం కోరాయి.

తెలంగాణ స్థానిక ఎన్నికల(Local Body Polls) నిర్వహణ ఎప్పుడు అన్న అంశంపై అడ్వకేట్ సురేందర్ పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 9న ఇచ్చిన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను ఆయన ఛాలెంజ్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పాత రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది కదా? అని ప్రశ్నించింది. అయితే అది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఎక్కడా లేదని ఎన్నికల సంఘం తరుపు న్యాయవాది తెలిపారు. వాదనల అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది.

Read Also: ఈ మంత్రులా రాష్ట్రాన్ని రక్షించేది: ఆర్ఎస్‌పీ

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>