డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం.. జానీ మాస్టర్ కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో నెలకొన్న వివాదం ముగిసినట్లేనని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) అన్నారు. తన వివరణతో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ సంతృప్తి చెందినట్లు భావిస్తున్నానని తెలిపారు. సమస్య తలెత్తినప్పుడే శేఖర్ మాస్టర్, తనను మెగాస్టార్ చిరంజీవి పిలిపించుకుని మాట్లాడినట్లు జానీ మాస్టర్ వివరించారు.

తమ మధ్య విబేధాలు లేవని మరోసారి స్పష్టం చేశారు. అలాగే, హీరో బాలకృష్ణ కూడా తనతో ఫోన్‌లో మాట్లాడి సమస్య అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. డ్యాన్సర్ల అసోసియేషన్‌కు ఫెడరేషన్ అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

సుమలత ఆధ్వర్యంలోనే అసోసియేషన్..

వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ సైతం స్పందించారు. జానీ మాస్టర్, సుమలత ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందుతున్నామని తెలిపారు. ఆయనపై మొదట ప్రకటించిన శాశ్వత బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

ప్రస్తుత అధ్యక్షురాలు సుమలత ఆధ్వర్యంలోనే ఇకపైనా కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అయితే, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అసోసియేషన్ జనరల్ సెక్రటరీపైనా చర్యలు తీసుకంటామని స్పష్టం చేశారు.

గొడవ ఎలా మొదలైందంటే..

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో సభ్యుల మెంబర్‌షిప్, ఎన్నిక వంటి అంశాల్లో బేధాభిప్రాయాలు వచ్చి గొడవ మొదలైంది. ఈ క్రమంలో అసోసియేషన్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాలుగా విడిపోయింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది.

ఈ క్రమంలో ఫిలిం ఫెడరేషన్‌పై జానీ మాస్టర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆయనపై వేటు నిర్ణయం ప్రకటించడంతో వివాదం ఇంకా పెద్దదైంది. దీంతో, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ రంగంలోకి దిగి మాట్లాడి సద్దుమణిగేలా చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>