డ్వాక్రా నిధుల వివాదం.. కలెక్టరేట్ ఎదుట మహిళల ధర్నా

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లాలోని బ్రహ్మపురి కాలనీకి చెందిన సరస్వతి డ్వాక్రా గ్రూప్ మహిళలు (DWCRA Women) సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఆకుల లక్ష్మి మాట్లాడుతూ.. గ్రూప్ సభ్యులు బ్యాంకు రుణానికి సంబంధించిన నగదును చెల్లించినప్పటికీ, శ్రీనిధి రిసోర్స్ పర్సన్ (RP) కవిత ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా సుమారు రూ.25 లక్షలు దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు.

దీంతో రుణ బకాయిలు పేరుకుపోయి బ్యాంకు అధికారులు గ్రూప్ సభ్యులకు రికవరీ నోటీసులు జారీ చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి దుర్వినియోగమైన నిధులను తిరిగి రాబట్టడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

Read Also: మెరిసే చర్మం కావాలా? ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>