ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది : ఎమ్మెల్యే వేముల వీరేశం

కలం, నల్లగొండ బ్యూరో : రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్, నకిరేకల్ (Nakrekal) ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) స్పష్టం చేశారు. ఆదివారం కేతేపల్లి మండల కేంద్రం, చీకటిగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

రైతులు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యాన్ని అదే రోజు నమోదు చేసి, ఎక్కడా ఆలస్యం లేకుండా వేగంగా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రైతులకు అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దళారుల మోసాలకు గురికాకుండా రైతులకు రక్షణ కల్పిస్తామని, తూకం నుండి రవాణా వరకు మొత్తం ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. మిల్లర్లతో సమన్వయం కొనసాగిస్తూ కొనుగోలు కేంద్రాల పనితీరుపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని ఆయన (Vemula Veeresham) తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కంపాసటి శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: కాంగ్రెస్ ప్రభుత్వం భూ కుంభకోణాలకు పాల్పడుతోంది: హరీశ్ రావు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>