Mobile Popup Ad
Mobile Popup Ad

సింగర్ మంగ్లీ వివాదంలో బిగ్ ట్విస్ట్

కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ సింగర్ మంగ్లీ (Singer Mangli) వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మంగ్లీ తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని సుబ్బారావు అనే న్యాయవాది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే అతనే తనను వేధిస్తున్నాడంటూ సింగర్ మంగ్లీ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై లాయర్ సుబ్బారావు తప్పుడు ఆరోపణలు చేస్తూ అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు. తనకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్లు ఉన్న వీడియోలను చూపించి, మరో వ్యక్తితో కలిసి తనపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు.

తాను రూ. 150 కోట్ల మోసానికి పాల్పడ్డానంటూ సదరు వ్యక్తి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని.. ఈ పరిణామాల వల్ల తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొంది. అతని వల్ల తన వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగ్లీ (Singer Mangli) ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు.. లాయర్ సుబ్బారావు పై కేసు నమోదు చేశారు. కాగా, అంతకుమందు మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగులతో పాటు మరికొందరు 150 మంది నుంచి రూ. 10 కోట్లు వసూలు చేశారని పంజాగుట్ట పీఎస్ లో లాయర్ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. మంగ్లీ ప్రచారం చేయడంతోనే పెట్టుబడులు పెట్టారని.. కొంతమంది మంగ్లీకే డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చారని ఆరోపించారు. డబ్బులు వసూల్ చేసిన తర్వాత నిందితులు పరారయ్యారని చెప్పారు. తన బాధితులే రూ.10 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారని వివరించారు. ఇప్పుడు మంగ్లీని డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరిస్తోందని లాయర్ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. దీంతో BNS 351(2), 352 సెక్షన్ల ప్రకారం మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగులతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also: ది ప్యారడైజ్ : కయాదు లోహర్ బర్త్‌డే .. స్పెషల్ పోస్టర్ రిలీజ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>