కలం, జనగామ : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనగణన-2026 నిర్వహణ కోసం జనగామ (Jangaon) జిల్లాలో టెక్నికల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha) శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా వెలువడిన నోటిఫికేషన్ మేరకు అభ్యర్థులను మెరిట్, నైపుణ్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఎంపిక వివరాలు..
టెక్నికల్ అసిస్టెంట్ మొత్తం 16 పోస్టులకు గాను 243 మంది దరఖాస్తు చేసుకున్నారు. మెరిట్ ఆధారంగా 84 మందిని ఎంపిక చేసి, శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో వారికి నైపుణ్య పరీక్ష (Skill Test) నిర్వహించారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని తుది జాబితాకు ఎంపిక చేశారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఒక పోస్టు కోసం 52 మంది దరఖాస్తు చేయగా, 1:6 నిష్పత్తిలో ఆరుగురిని ఇంటర్వ్యూకు పిలిచి సర్టిఫికేట్స్ పరిశీలించి ఒకరిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా (Jangaon) ఉపాధి అధికారి (ఇంచార్జి) రవికాంత్, సీపీఓ చిన కోట్యా నాయక్, సూపరింటెండెంట్ ఫణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: తెలంగాణకి మోదీ.. గ్రాఫ్ పెరిగేలా పొలిటికల్ స్కెచ్
Follow Us On: Facebook

