కలం, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీని (Modi) గద్దె దించడమే తనప్రధాన లక్ష్యం అని పశ్చి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. బెంగాల్ లో జరిగిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘బెంగాల్ ప్రజలను హింసించిన వారు కచ్చితంగా నరకానికి వెళ్తారు. వాళ్లను కర్మ వదిలిపెట్టదు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తేనే బెంగాల్ ప్రజలకు స్వేచ్ఛ, హక్కులు ఉంటాయి. లేదంటే మనల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతారు’ అంటూ సీఎం మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుందన్నారు మమతా బెనర్జీ. తమలాంటి వారు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా ఇష్టారీతిన కేంద్ర సంస్థలతో కేసులు పెట్టించి వేధిస్తున్నారని.. అలాంటి వారికి కచ్చితంగా బుద్ధి చెబుతామన్నారు మమతా బెనర్జీ (Mamata Banerjee).
Read Also: ఐపీఎల్ కి ముందు కేకేఆర్‌కు వరుస షాక్‌లు.. స్టార్ బౌలర్ ఔట్..!
Follow Us On: X(Twitter)

