Mobile Popup Ad
Mobile Popup Ad

ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్​.. విద్యార్థులకు పాఠాలు

కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha) సోమవారం నర్మెట్ట మండలంలోని కేజీబీవీ (KGBV) పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో ముచ్చటించి వారికి స్వయంగా గణితం బోధించారు. క్లిష్టమైన లెక్కలను సులువుగా ఎలా సాధించాలో వివరించి, విద్యార్థుల సామర్థ్యాన్ని స్వయంగా పరీక్షించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించిన కలెక్టర్.. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, వంట గదిని పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Read Also: విజ‌న్ లేదు.. విధ్వంస‌మే.. అసెంబ్లీలో హ‌రీశ్ నినాదాలు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>