కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఇరు సభలను ఉద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓవైపు గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన విజన్‌తో ముందుకు వెళ్తోందని చెప్తున్న సమయంలోనే హరీశ్ రావు ఈ ప్రభుత్వానికి విజన్ లేదు.. అంతా విధ్వంసమే అంటూ నినాదాలు చేశారు.
ఈ ప్రభుత్వం అన్నీ డిస్ట్రాక్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు అమలు చేయాలని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీ, మండలికి హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా హరీశ్ రావు (Harish Rao) సహా పలువురు నేతల నినాదాలతో సభలో గందర గోళం నెలకొంది.
Read Also: వరి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామి : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
Follow Us On: X(Twitter)

